కట్టర్‌తో వేళ్లు కట్‌చేసి దారుణంగా హత్య.. నిందితులు ఎలా దొరికారంటే?

ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో ఇటీవల జరిగింది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు తాజాగా పట్టుకున్నారు.

Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!
New Update

ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో ఇటీవల దారుణమైన హత్య జరిగింది. పక్క పక్కనే నివసిస్తున్న రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలు కారణంగా ఈనెల రెండవ తేదీన ఇరువురు ఒకరి మీద ఒకరు బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇదే హత్యకు ప్రధాన కారణం అయింది అని పోలీసులు అంటున్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకొని వెంకటగిరి పోలీస్ స్టేషన్ నందు గూడూరు డి.ఎస్.పి వివి రమణ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

హత్యకు దారి తీసిన వివాదం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలాయపల్లి మండలం జయంపు గ్రామానికి చెందిన శివారెడ్డి కళ్యాణ్ రెడ్డి, అల్లం లక్ష్మయ్య ఇద్దరు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. ఈనెల రెండో తేదీ ఒకరి మీద ఒకరు బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!

అనంతరం శివారెడ్డి కళ్యాణ్ రెడ్డి, అల్లం లక్ష్మయ్యను చంపేందుకు తిరుపతికి చెందిన కొంతమందిని లక్ష రూపాయలు సుపారికి మాట్లాడుకున్నారు. అందుకుగాను 20 వేల రూపాయలు వారికి అడ్వాన్స్ చెల్లించారు. మరుసటి రోజు సూపరీ తీసుకున్న కొందరు దుండగులు.. అల్లం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి మేము పోలీసులు అంటూ మీ కేసును విచారించాలంటూ టెంపోలో తీసుకెళ్లారు. 

బొటనవేలు కట్టర్‌తో కట్ చేసి ఆపై

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

జయంపు గ్రామ శివారు ప్రాంతంలో అల్లం లక్ష్మయ్యను అత్యంత దారుణంగా రెండు చేతుల బొటనవేలును కట్టర్‌తో కట్ చేసి ఆపై రాడ్డు, కర్రలు, జాకీతో బలంగా కొట్టి అక్కడనుంచి పారిపోయారు. అధిక రక్త శ్రావంతో పడి ఉన్న లక్ష్మయ్యను గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలో చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.

ఎలా దొరికారంటే? 

ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ!

పరారైన 10 మంది నిందితులు (సుపారిముఠా) కుదుర్చుకున్న సుపారి బ్యాలెన్స్ అమౌంట్ కోసం రైల్వే స్టేషన్‌లో ఉండగా పోలీసులు వారిని అదుపు అదుపులోకి తీసుకున్నారని డి.ఎస్.పి వివి రమణ కుమార్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందిస్తామని చెప్పారు.

#murder-case #crime news 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe