చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి అన్ని రకాల అవకాశాలున్నాయని.. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవుతుందని తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన సాయం అందుతుందని తెలిపారు.
ఏపీలో ప్రధాని మోదీ రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము అండగా ఉంటామన్నారు. '' ఏపీపై అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. ఏపీ అభివృద్ధి మా విజన్, ఏపీ ప్రజలకు సేవ చేయడమే మా సంకల్పం. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం.
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటాం. ఏపీకి అన్ని రకాల అవకాశాలున్నాయి. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవుతుంది. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందుతుంది. ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారింది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యమని'' ప్రధాని మోదీ అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ '' పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. దేశంలో అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాల అనేవి మోదీ నినాదాలు. భారత్‌ను బలమైన ఆర్థి దేశంగా తీర్చిదిద్దేందుకు మేకిన్ ఇండియాను తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియాను తెచ్చారు. ముంబయి దేశానికి ఆర్థిక రాజధానిగా ఎలా ఉందో.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా విశాఖపట్నం అలాంటి నగరమే. మోదీ చేపట్టే కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది 2047 నాటికి అభివృద్ధిలో ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానానికి చేరుకుంటాం. మేమ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిదని'' చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

Also Read: హైకోర్టులో ఊరట.. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు లైన్ క్లియర్!
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటాం. ఏపీకి అన్ని రకాల అవకాశాలున్నాయి. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవుతుంది. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందుతుంది. ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారింది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యమని'' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు TTD చైర్మన్ అదిరిపోయే శుభవార్త!