ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మన్యం జిల్లా పర్యటించారు. అక్కడ గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. అక్కడి స్థానిక గిరిజన మహిళలతో కలిసి ఆయన డాన్స్ వేశారు. ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ నృత్యం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పవన్ ఇవాళ మక్కువ మండలం బాగుజోలలో పర్యటించారు. బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్లతో 9 కి.మీ మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని హామీ ఇచ్చారు. Deputy CM @PawanKalyan dancing with the tribals of Manyam ❤️🥺!!#PawanKalyan#ApGovtForTribalWelfare #PawanKalyanAneNenu pic.twitter.com/AO3WnS2Tou — Naveen🦅 (@kasaninaveen1) December 20, 2024 రూ.36.71 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో 39.32 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇది పూర్తి కాగానే 3,782 మంది గిరిజనుల డోలీ కష్టాలు తీరనున్నాయి. అలాగే బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్ల వ్యయంతో 9 కి.మీ మేర తారు రోడ్డుగా మార్చుతున్నామన్నారు. OG OG అని అరిస్తే పనులు జరగవు ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు తన జీవితంలో ఈర్ష్య ఉండదని అన్నారు. ఎవరైనా తన కంటే ఎత్తుకు ఎదిగినా.. విజయం సాధించినా అసూయ ఉండదని తెలిపారు. అనంతరం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అభిమానులకు చురకలు పెట్టారు. తనను పని చేసుకోనివ్వండని.. తాను బయటికొస్తే తన మీద పడిపోతే తాను ఏ పని చేయలేనని అన్నారు. అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేనుOG OG అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదాసినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు… pic.twitter.com/2GHLz58kuF — Telugu Scribe (@TeluguScribe) December 20, 2024 అలాగే OG OG అని అరిస్తే పనులు జరగవని అన్నారు. ఇక సీఎం సీఎం అంటారు.. డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని తెలిపారు. హీరోలకు జేజేలు కొట్టండి కానీ.. మీ జీవితాలపై దృష్టి పెట్టండి అని పవన్ పేర్కొన్నారు. ""సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారన్నారు"". అని అన్నారు. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారని.. అయితే మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.