Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతో బీజేపీ జట్టుకట్టి.. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. తాజాగా బీజేపీ పవన్ కళ్యాణ్‌కు మరో బాధ్యత అప్పగించింది.
Also Read: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం మహారాష్ట్ర ఎన్నికలపై గట్టిగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్‌ను బరిలోకి దించనున్నట్లు సమాచారం.
Also Read: Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‍ను కోరింది. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read: TS:బీజేపీ,బీఆర్ఎస్‌లు కవల పిల్లలు–తెలంగాణ సీం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ ఛరిష్మాను ఉపయోగించుకుని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికలు రచించింది. మొన్నామధ్య జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరుఫున ప్రచారం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Also Read: BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూటమి తరుఫున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరగనుంది. మొత్తానికి మరాఠా ఎన్నికలకు తెలుగు నేతల ప్రచారం నేపథ్యంలో మంచి ఊపు మీద ఉంది.
మరోవైపు 288 మంది సభ్యుల బలమున్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి.