Pastor Praveen Mother : పాస్టర్ ప్రవీణ్‌ మరణం...తల్లికి అనారోగ్యం?

పాస్టర్ ప్రవీణ్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ  తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు.

New Update

పాస్టర్ ప్రవీణ్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ  తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు. మీ ఆరోగ్యం జాగ్రత్తమ్మ, మంచిగా తిని విశ్రాంతి తీసుకోండని చెప్పారు.10 రోజుల కిందే మీకు ఆరోగ్యం బాలేదంటే..పాస్టర్ ప్రవీణ్‌ వచ్చి వెళ్లారని.. ఇంతలోనే ఇలా అయిందని ఆశావర్కర్ దేవి ఫోన్ లో వాపోయారు. తాను 20ఏళ్ల నుంచి ప్రవీణ్ అన్నను చూస్తున్నానని.. కానీ కడసారి ఆయన ముఖం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ మరణంతో మనకు తెలిసినవాళ్లంతా బాధపడుతున్నారని మరియమ్మతో ఫోన్ లో చెప్పుకొచ్చారు దేవి. ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ గా మారింది. 

Also Read :  ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!

Also Read :  ఆ అందగత్తెతో  డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్‌

లారీ కింద పడి.. 

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలో వెనుక ఓ బస్సు కూడా వచ్చింది.  ఆ బస్సు డ్రైవర్ వెంటనే రైట్ తీసుకోవడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే కింద పడిన ప్రవీణ్ ను స్థానికులు పైకి లేపి కూర్చొబెట్టారు.  ఆ తరువాత కాసేపటికే బైక్ తీసుకుని రాజమండ్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

Also read :  అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!

Also read : Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా!

Advertisment
తాజా కథనాలు