Crime News : భార్య, అత్త వేధింపులతో మరో నిండు ప్రాణం బలి

భార్య అత్త వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణం తీసుకున్నాడు. చనిపోయేముందుసేల్పీ విడియో తీకుకున్నాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో అత్తను, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

New Update
Another life lost due to harassment by wife and aunt

Another life lost due to harassment by wife and aunt

ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సాంబారులో విషం పెట్టి చంపిన భార్య.. హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హతమార్చిన భార్య.. ఇవీ ఇటీవల తరచూ వినిపించే వార్తలు. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణంగా హతమారుస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో కొందరు భర్తలు తెగ భయపడిపోతున్నారు. మరికొందరైతే.. ప్రియుడు ఉన్నాడని తెలిస్తే భార్యలను వారితో పంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే భార్య అత్త వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణం తీసుకున్నాదు. చనిపోయేముందు తన అత్త,భార్యలు ఏ విధంగా టార్చర్‌ పెడుతున్నారో వివరించాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో అత్తను, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి:ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందరూ గల్లంతు!

Wife And Aunt Harassement Husband Suicidde

ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. భార్య, అత్త పెట్టే వేధింపులు భరించలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా, ఆ యువకుడు చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడటంతో సంచలనంగా మారింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొట్టాలి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుంకుమ తేజేష్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  ఏడాది క్రితం నెల్లూరు సమీపంలోని పొట్టే పాళెంకు చెందిన సరళ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన కొద్ది నెలలు వారి సంసారం సాఫీగా నే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి.

సరళకు గతంలోనే పెళ్లయింది. అయితే ఏదో కారణాలతో భర్తను వదిలేసినట్లు తెలిసింది. ఆమెకు విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరిక ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు  జరుగుతున్నాయని తెలుస్తోంది. కారు డ్రైవర్ అయిన తేజేస్ సంపాదన లేకపోవడం వల్ల అతన్నిఅత్త, భార్య మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌గా ఉన్న తనకు సంపాదన లేదని, పోషించలేని వాడికి పెళ్లెందుకని తన భార్య ఇద్దరూ తరచూ వేధిస్తున్నారని... తన మరణానికి వారే కారణమంటూ వివరిస్తూ... పుట్టుపల్లి సమీపంలో గడ్డిమందు తాగినట్లు సెల్ఫీ వీడియో తీసి ఆదివారం కుటుంబ సభ్యులు, మిత్రులకు పంపారు. విషయం తెలుసుకున్న స్థానికులు తేజేస్‌ కోసం పరిసరాల్లో వెతకగా అపస్మారక స్థితిలో ఉన్న స్థితిలో దొరికాడు. అయితే ఆయనను మొదట ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక అందించారు. అనంతరం జీజీహెచ్‌కు  తరలించారు. చికిత్స పొందుతూ తేజేస్‌ సోమవారం రాత్రి మృతిచెందారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుమలరావు తెలిపారు.   

ఇది కూడా చదవండి:  సంచలనం రేపుతున్న ధర్మస్థల కేసు.. తవ్వకాలు మొదలు పెట్టి దర్యాప్తు చేస్తున్న సిట్

car-driver | suicide | nellore | latest-telugu-news | telugu-news | andhra-pradesh-crime-reports | telugu crime news

Advertisment
తాజా కథనాలు