Janasena Pawan: ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జనసైనికులకు పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా కూటమిలోని మూడు పార్టీలతో ప్రతినెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించారు. కూటమిలోని పార్టీలు సమష్టి ఆలోచనలతో ఒకే గళం వినిపించాలని ఆయన జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. సమన్వయం కోసం జనసేన తరఫున త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయాలని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలో తెలియజేస్తామని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు వివరించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని శనివారం రాత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఆయన సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పాలన, రాజకీయపరమైన అంశాలపై వారికి మార్గదర్శనం చేశారు.
అనంతరం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఐదు నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని అక్కడ విస్తృతంగా పర్యటించాలని, పార్టీ శ్రేణులతో మమేకం కావాలని పవన్ వారికి సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించడంతో పాటు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలి’’ అని పవన్‌కల్యాణ్ సూచించారు.
‘ నియోజకవర్గాల వారిగా ఉపాధి, ఉద్యోగ కల్పన, రక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల అభివృద్ధి, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం శాసనసభాపక్షం నుంచే ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ వేసుకుందామని ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు సంబంధిత అంశాలపై నివేదికలు అందించాలి’ అని పవన్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కొత్త నాయకత్వాన్ని, యువతరాన్ని ప్రోత్సహిస్తుందని,ఆసక్తి ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవాలని పవన్ నాయకులకు చెప్పారు. ‘జెన్ జీ’తో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థం చేసుకోవాలని, అప్పుడే వారి ఆవిష్కరణలు మనకు తెలుస్తాయని పవన్ సూచించారు.
గతంలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ కోసం రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిందని ఉపముఖ్యమంత్రి వవన్ పేర్కొన్నారు. ఆ ప్యాలెస్‌ను వినియోగంలోకి తీసుకు రావడంపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మనకు బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ పొత్తు ధర్మం పాటించి పోటీకి దూరంగా ఉన్నామని అయితే ప్రస్తతం అక్కడి మన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యల్ని లోతుగా అధ్యయనం చేయాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వాటిపై చర్చించాలని కోరారు. మీ నియోజకవర్గాల్లో అభివృద్ది కోసం అనుసరించిన మేలైన విధానాలు, విజయగాథలను పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పటికపుడు తెలియజేయండి’’ అని నాయకులకు పవన్ కోరారు. నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రమం చేపట్టాలని పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతినెలా రెండుసార్లు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించుకుందామని, తద్వారా సభలో మనం ప్రస్తావించాల్సిన అంశాలపై మరింత స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. కన్నతల్లిని గొంతు కోసి చంపి.. శవాన్ని ఏం చేశాడంటే?
Janasena Pawan: మనది ఇక త్రిశూల వ్యూహం.. జనసేన మీటింగ్ లో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జనసైనికులకు పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా కూటమి పార్టీలతో ప్రతినెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించారు.
JanaSena Party