తమ్ముడు వైసీపీ, అన్న జనసేన.. రసవత్తరంగా మారిన పాలిటిక్స్
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నేతలు ఎటు వైపు మళ్లుతున్నారో తెలియక కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాఫిక్‌గా మారింది.