ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఓ శుభకార్యానికి వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురికావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

New Update
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Fatal road accident in Prakasam district

డ్రైవర్‌ నిద్ర మత్తు కారణం

దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ అజీస్‌, జానీబేగం, అబ్దుల్‌ హనీ, నూర్జహాన్‌, షేక్‌ రమీజ్‌, షబీనా, షేక్‌ హీనామరణించారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ఎడుగురు మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

Fatal road accident in Prakasam district

బస్సును తప్పించబోయి ప్రమాదం

బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్‌ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. బస్సు దూసుకెళ్లిన సాగర్ కాల్వలో పెద్దగానీటి పవాహం లేదు. లేకుంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు

ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో ఎడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని సీఎంకి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు