/rtv/media/media_files/2025/05/28/VrzxQjHFTLNggLdeIC9B.jpg)
NTR University Opens Applications for Nursing Entrance Test 2025
ఏపీలో BSC నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ నాలుగేళ్ల BSC నర్సింగ్ కోర్సులో ఎంట్రెన్స్ కోసం NTR యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీఎన్‌సెట్ 2025 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కన్వినర్ కోటాతో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో నర్సింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు APNCETకు హాజరు కావాలి. దీని కోసం బాల బాలికలు అప్లై చేసుకోవచ్చు.
ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
APNCET - 2025
దీనికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్, తత్సమన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే బైపీసీలో కనీసం 45 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు ఈ APNCET ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలతో పాటు ప్రైవేట్ అన్ ఎయిడెడ్, మైనార్టీ, నాన్ మైనార్టీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
ఆసక్తిగల అభ్యర్థులు APNCETకు అప్లై చేసుకోవచ్చు. దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 28 వ తేదీ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. అభ్యర్థులు జూన్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందా? చాట్‌జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!
OC అభ్యర్థులు రూ.1180 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ మొత్తంలో పరీక్ష ఫీజు రూ.1000, 18 శాతం జీఎస్టీతో కలిపి ఉంటుంది. అలాగే SC, ST, BC అభ్యర్థులు రూ.944 ఫీజు చెల్లించాలి. ఇందులో రూ.800 ఫీజు, రూ.144 జీఎస్టీ ఉంటుంది. ఇక BSC నర్సింగ్ కోర్సులో ఎంట్రెన్స్ కోసం OC అభ్యర్థులకు 50 శాతం మార్కులు రావాలి.
అదే SC, ST, BC, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఇక జనరల్ క్యాటగిరీ వికలాంగులు 45 శాతం మార్కులు తెచ్చుకోవాలి. APNCETపై సందేహాలుంటే 90007 80707, 80082 50842 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. అర్హత పరీక్షపై సందేహాలుంటే 89787 80501, 93918 05245 సంప్రదించాలి.