Operation Sindoor : దేశ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ త్యాగం వెలకట్టలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. వీర జవాన్ పార్థివదేహం నిన్న రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో జిల్లా కేంద్రానికి అక్కడి నుంచి కళ్లితండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మురళీ భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కొంత ఎమోషనల్‌కు గురయ్యారు. ఆయన కంటతడి పెట్టుకున్నారు. పవన్‌తో పాటు మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సవిత వారి కటుంబాన్ని ఓదార్చారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
ఈ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం అందిస్తానని పవన్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
మురళీ కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వపన్ స్పష్టం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన దేవున్ని ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని.. ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.కాగా మురళీ అంత్యక్రియలు సైనిక, అధికార లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇక మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. బాలకృష్ణ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామం కళ్లితండాను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు