తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యకేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(MLA Bojjala Sudhir Reddy) కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసుపై కచ్చితంగా ఎంక్వైరీ చేయించాలన్నారు. తాను ఎలాంటి ఎంక్వైరీకి అయిన తాను సిద్దమన్నారు. మర్డర్ చేసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సెల్పీ వీడియో చేయడం దారుణం అన్నారు. మర్డర్ చేయలేదని, తనకు బెయిల్ వచ్చిందనడం హాస్యాస్పందం అని అన్నారు. దీనిపై తాను ఏస్పీతో మాట్లాడుతానన్నారు. బెయిల్ పై బయట ఉన్నప్పుడు ఇలా ఎలా మాట్లాడుతారని, దీనిపై తాను తమ లాయర్లతో చర్చిస్తామన్నారు. ఇలాంటి క్రిమినల్స్ పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్నారు.
అన్ని విషయాలు బయటకు రావాలి
రాయుడు చనిపోయే ముందు తీసిన వీడియోపై కూడా బొజ్జల స్పందించారు. దీనిపై పక్కా ఎంక్వైరీ చేయాలన్నారు. అతన్ని ఎన్ని కష్టాలు పెట్టారో అన్ని విషయాలు బయటకు రావాలన్నారు. అసలు తనకు రాయుడు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇలాంటి చెత్త రాజకీయలు చేస్తే వదలబోమని హెచ్చరించారు. ఇందులో తప్పు ఎవరు చేసిన శిక్ష పడటం ఖాయం అన్నారు బొజ్జల. కూటమి ప్రభుత్వంలో తమకోసం వినుత పనిచేయలేదన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులను కూడా ఆమె ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వినుత కోట గతంలో పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోయి ఓడిపోయారని చెప్పారు. అందరి దయ, ఆశీర్వాదాలతో తనకు టికెట్ దక్కిందని, కష్టపడి పనిచేశా కాబట్టే తనను ప్రజలు గెలిపించారని తెలిపారు.
Also Read : తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
వినుత సంచలన వీడియో!
డ్రైవర్ రాయుడు హత్యకేసు(kota vinutha driver rayudu case) లో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి(Srikalahasti) జనసేన(janasena) సస్పెండెడ్ నేత కోట వినుత(Vinutha Kotaa) అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ ను కలిసి అన్నీ వివరిస్తామని వినుత వెల్లడించారు. తాము హత్య చేయలేదు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ఫారెన్ లో రూ.లక్షల జీతాలు వదులుకున్నామని ఆమె తన వీడియోలో వివరించారు. ప్రాణాలు తీసేందుకు రాజకీయాల్లోకి రాలేదని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు వినుత. నిజనిజాలు దేవదేవుడు శివయ్యకు తెలుసునన్నారు. కోర్టులో ఉన్నందున దీని గురించి ఎక్కువ మాట్లాడలేనని, కచ్చితమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తామని వినుత స్పష్టం చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
MLA Bojjala Sudhir Reddy : రాయుడు హత్య కేసు...ఎమ్మెల్యే బొజ్జల సంచలన కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యకేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసుపై కచ్చితంగా ఎంక్వైరీ చేయించాలన్నారు.