Kodali Nani : నేను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాను...అరెస్ట్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

కొడాలి నాని కోల్‌కతా నుంచి కొలంబోకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్‌, ఆదార్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.  

New Update
Former Minister Kodali Nani

Former Minister Kodali Nani

Former Minister Kodali Nani :  కొడాలి నాని కోల్‌కతా నుంచి శ్రీలంకలోని కొలంబోకు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్‌ చేశారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఉట్టిదేనని తేలింది. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్‌, ఆదార్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.  కాగా, వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని ఈ రోజు కోల్‌కతా మీదుగా కొలంబో వెళ్లడానికి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకోగా పోలీసులు అరెస్ట్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన పై ప్రభుత్వం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయడంతో అరెస్ట్‌ చేశారన్న వార్తలు వచ్చాయి.

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

కాగా మరోవైపు కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆయన్ను అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆయన అరెస్టు అయ్యాడని వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు.కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు.

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

    Advertisment
    Advertisment
    తాజా కథనాలు