KCR ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. ఈ నెలలోనే కేసీఆర్, హరీశ్ విచారణ! ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది. By Nikhil 15 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ మెదక్ New Update షేర్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు పీసీ ఘోష్ కమిషన్ సమన్లు పంపించనుందా? అనంతరం వీరిని విచారించనుందా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అంశాలపై ఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 12 నుంచే విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి జీవో రాలేదు. ఇటీవల కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డిసెంబర్ ఆఖరు వరకు కాళేశ్వరంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.ఇది కూడ చదవండి: నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే ప్రభుత్వం జీవో జారీ చేయడంలో జాప్యం కారణంగా విచారణ రెండు వారాల పాటు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలు, ఎస్‌ఈలు, చీఫ్ ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ను ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ ప్రజాప్రతినిధులకు సమన్లు పంపాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. Also Read: తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట! గత ప్రభుత్వ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి కీలక పాత్ర పోషించిన ఇద్దరు మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు రావాలని సమన్లు పంపనుందని తెలుస్తోంది. అనంతరం వీరిని విచారించనుంది. వీరిని విచారించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను కమిషన్ ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వీరిద్దరికి సమన్లు పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి విచారణ తర్వాత డిసెంబర్ నెలాఖరులో ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..! కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా హరీశ్, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అనేక సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. సెకండ్ టర్మ్ లో ఆ శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. కేసీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని ఇప్పటికే అధికారులు విచారణలో స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన విషయాలు, కమిషన్ సేకరించిన వివరాల ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావును కమిషన్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! Also Read: కార్తీక పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే లక్ష్మీ కటాక్షం #pc ghosh #harish-rao #kcr #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి