రాయచోటి లో చంద్రబాబు ప్రజాగళం-LIVE
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో లేక వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. షర్మిల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది.
AP: కూటమి మేనిఫెస్టోపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో మీ ఫోటో పెట్టుకోండి కానీ మోడీ ఫొటో పెట్టుకోవద్దని చంద్రబాబును BJP హెచ్చరించిందని అన్నారు. కూటమిలో ముగ్గురి ఫొటోలు పెట్టుకునే పరిస్థితి లేదని.. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారని ఫైర్ అయ్యారు.
AP: సీఎం జగన్ తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. జగన్ రిమోట్ ఇంట్లో ఉందని భారతీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్‌ని చంపిన అతనికి ఎంపీ టికెట్ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. వైఎస్ పేరును సీఎం జగన్ ఛార్జిషీట్లో పెట్టించారని ఆరోపణలు చేశారు.
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి గెలిపించాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కడప జిల్లా పులివెందులలోని కదిరి రింగ్ రోడ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నెలకొరిగింది. దీంతో, అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన ఉమామహేశ్వరీ, కొడుకు ఫణి కుమార్(18), కూతురు ధనలక్ష్మి(17) ఆత్మహత్య చేసుకున్నారు. గంగయపల్లి బారెడ్డి పల్లె మధ్యలో వేప చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
AP: పులివెందుల మండలం రంగాపురంలో పర్యటించిన సునీతకు షాక్ తగిలింది. ఆమె వివేకా హత్య గురించి మాట్లాడుతుండగా.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.. ఆ విషయాన్ని మాట్లాడొద్దని హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తప్పకుండా మాట్లాడుతానని గ్రామస్తులతో ఆమె వాగ్వాదానికి దిగారు.