AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు

ఈ నెల 12, 13,14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని...భారీ నుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల చేసేవారు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

New Update
rains ap

Rains In AP: 


 
నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని..దీని ప్రబావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర వాఆవరణశాఖ తెలిపింది. ఆతరువాత రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపారు. ఆవర్తనం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.

Also Read: AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ..

దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో అంటే..12,13,14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు కూడా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రేపు కూడా వర్షాలు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

Also Read: USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్

RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు