/rtv/media/media_files/2024/12/23/kmpX005PJt3MVHV28J8i.jpg)
kadapa corporation
Kadapa: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదిక పై కుర్చీ ఏర్పాటు చేయలేదు.దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. గతంలోనూ ఇలాగే చేవారంటూ ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మాధవీ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ మేయర్ సురేశ్ బాబు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Parwada Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!
మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమో. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారు. విచక్షణాధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు మహిళలంటే చిన్న చూపు.
Also Read: BIG BREAKING : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్
కడప రెడ్డమ్మ vs వైసీపీ మేయర్,
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
కడపలో కాక రేపుతున్న కుర్చీ రాజకీయం..
ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం,
వేదికపై కుర్చీ కోసం టీడీపీ, వైసీపీ మధ్య వార్..#kadapaReddamma #Vs #mayor #TDPvsYCP #kadapa #AndhraPradesh #RTV pic.twitter.com/gog03Lc0R3
అందుకే మహిళలను నిలబెట్టారు. వైసీపీ పాలనలో కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకపోవడంతో అంతర్యమేంటి? కడప అభివృద్దిని కుంటుపరిచారు. ఇక్కడ జరిగిన అవినీతి పై మాట్లాడాలి. అవినీతి పై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారు అని మాధవీరెడ్డి విమర్శించారు.
Also Read: మస్క్ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్
ఈ క్రమంలో మేయర్ సురేశ్‌బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మధ్య వాదోపవాదాలు సాగాయి. కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే నిలబడే ఉన్నారు. మేయర్ కుర్చీకి ఓ వైపు టీడీపీ,మరో వైపు వైసీపీ కార్పిరేటర్లు నిల్చొని నిరసన తెలిపారు. మేయర్ కుర్చీ వెనుక ఇరుపక్షాల వాదోపవాదనలు సాగాయి. పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్!
ఏడుగురు కార్పొరేటర్ల సస్పెండ్
సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ సురేశ్ బాబు ప్రకటించారు. వైసీపీ కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
మరో వైపు ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకపోవడంతో నగరపాలక సంస్థ కార్యాలయం బయట ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళను గౌరవించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్యయ సమావేశం సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.