అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధంకేసులో జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను సిఐడి అధికారులు బంగారు పాళ్యంలో అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సబ్ కలెక్టరేట్ ఫైల్ దగ్ధంకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను ఎట్టికేలకు తిరుపతి సిఐడి అధికారులు పలమనేరులో అరెస్టు చేశారు. అనంతరం సోమవారం సాయంత్రం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
కేసు ఏంటంటే?
జులై 21న అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. అయితే దీని వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే క్రమంలో ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఉద్యోగులను పోలీసులు విచారించారు. ఆర్డీవో, ఇతర అధికారులను దాదాపు వారం రోజుల పాటు పోలీసులు విచారించారు. ఇందులో ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.
ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?
అప్పట్లో ఈ ఫైళ్ల దగ్ధంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో భాగంగా మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసుపై సీఐ వలిబసు సరిగా విధులు నిర్వహించలేదని అధికారులు గుర్తించారు. అనంతరం అధికారులు సీఐ వలిబసుపై చర్యలు తీసుకున్నారు. దాంతో సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ జులై 24న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.