YCP-Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!

YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.

New Update

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌ పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. పార్టీ నేతలు మాత్రం అదేం లేదంటూ కొట్టి పారేస్తూ వచ్చారు.

ఇది కూడా చదవండి: AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త

నిన్న పార్టీ మీటింగ్ కు డుమ్మా..

అయితే.. నిన్న కృష్ణా జిల్లా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జోగి రమేష్ హాజరు కాలేదు. ముఖ్య నేత అయిన జోగి రమేష్ జిల్లా పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా మీటింగ్ కు రాలేదు. దీంతో వీరిద్దరూ పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. జోగి రమేష్ టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CBN: పాలిటిక్స్ కు పనికిరావు.. ఆ మంత్రిపై లైవ్ లోనే చంద్రబాబు సీరియస్!

కేసుల నుంచి కాపాడుకునేందుకే..?

ఇటీవల అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యారు. ఇంకా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నోటీసులు రావడంతో విచారణ నిమిత్తం జోగి రమేష్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏ క్షణమైనా జోగి అరెస్ట్ అవుతార్న ప్రచారం కూడా కొన్ని రోజుల క్రితం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో చేరితే ఈ ఇబ్బందులు ఉండవని జోగి రమేష్ భావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు