CBN: పాలిటిక్స్ కు పనికిరావు.. ఆ మంత్రిపై లైవ్ లోనే చంద్రబాబు సీరియస్!

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్‌ సీరియస్‌ అయ్యారు. పార్టీకి ఉపయోగపడని, పార్టీ కోసం పనికిరాని రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో సీరియస్‌ గా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారు.

New Update

Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పై సీరియస్‌ అయ్యారు. నువ్వు రాజకీయాలకు పనికిరావు అంటూ కాన్ఫరెన్స్‌ కాల్‌ లోనే మంత్రిని చంద్రబాబు తిట్టారు.

Also Read: బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్‌.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక

మంత్రి వాసంశెట్టి సొంత నియోజకవర్గమైన రామచంద్రపురంలో పార్టీ సభ్యత్వం  చాలా తక్కువగా ఉందని బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 

Also Read:  ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. డార్లింగ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ భారీ ప్లానింగ్?

ఈ క్రమంలోనే ఆయన మంత్రి మీద సీరియస్‌ అయినట్లు తెలుస్తుంది. మొదటిసారి గెలిచినప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చాం, పార్టీ నీకు చాలా గౌరవం కూడా ఇచ్చింది. దానిని నువ్వు కాపాడుకోవాలంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి అయినప్పటికీ కూడా రాజకీయాల్లో సీరియస్‌ నెస్‌ రాలేదంటూ అక్షింతలు వేశారు.

Also Read:  కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత

పార్టీకి ఉపయోగపడని, పార్టీ కోసం పనికిరాని రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇక నైనా రాజకీయాల్లో సీరియస్ గా ఉండి, ప్రూవ్‌ చేసుకోవాలని చంద్రబాబు వాసంశెట్టికి గట్టిగా క్లాస్‌ పీకారు. 

Also Read: Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?

 

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు త్వరలోనే జనసేనలో కొత్త వింగ్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. ఆ వింగ్‌కు నారసింహ వారాహి బ్రిగేడ్‌గా పేరు పెడుతున్నట్లు చెప్పారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అన్ని మతాలను గౌరవిస్తా, నా విశ్వాసాలపై నిలబడతా అని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

ధర్మ పరిరక్షణ కోసం.

ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్. జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేన కృషి చేస్తోందని అన్నారు. ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని చెప్పారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు