AP Rains:
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, , చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడ్రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నగరి, గంగాధరనెల్లూరు, వి.కోట, పాలసముద్రం, శ్రీ రంగరాజపురం, నిండ్ర, చిత్తూరు, చౌడేపల్లె, చిత్తూరు రూరల్, తవణంపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల,యాదమరి, బైరెడ్డిపల్లె, విజయపురం, సోమల, వెదురుకుప్పం, సదుం,పెనుమూరులో వర్షాలు పడుతున్నాయి. చిత్తూరులో గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్మేసి వానలు కురిశాయి.
Also Read: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!
భారీ వర్షాల ప్రభావంతో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి తెలిపారు. అలాగే పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని.. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు.
Also Read: Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్‌లోని వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వర్ష సూచనతో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు అధికారులు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు వహించాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.