పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ? తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 22 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి పవన్ కల్యాణ్‌కు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనపై సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంపై పవన్.. తన హోదా మరిచిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపారు. పవన్ మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. Also Read: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు Pawan Kalyan - Hyderabad Civil Court మరోసారి తిరుపతి లడ్డూపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాంగ్ ఆర్టర్ ఇవ్వాలన్నారు. దీంతో పవన్ కల్యాణ్‌ను నవంబర్ 22న విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ పవన్ రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలాఉండగా.. తిరుపతి లడ్డూ తయారుచేసేందుకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని.. జంతు కొవ్వును అందులో వాడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా లడ్డూ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! మరోవైపు తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ఆధారాలు లేకుండానే లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించింది. Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ? నెయ్యి కల్తీపై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా సీఎం వ్యవహరించారని వ్యాఖ్యానించింది. కల్తీపై వాస్తవాల నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. దీనివల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పింది. Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..! #hyderabad-city-civil-court #hyderabad #ttd #pawan-kalyan #thirupathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి