TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు.

New Update
mahesh kumar goud

అదానీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.రాహుల్ గాంధీ మాటే.. మా మాట అని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. 

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

TPCC Chief Mahesh Kumar Goud Comments on Adani

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అదానీకి లాభం చేకూర్చారని విమర్శించారు. అదానీ, అంబానికి ఆయన చాలా వెసులుబాటు కల్పించారని ఆరోపించారు. స్టాక్‌ మార్కెట్లను అదానీ మ్యానిప్యూలేట్ చేశారని ఆరోపించారు. అదానీ అరెస్టయితే మోదీ ప్రధానిగా రాజీనామా చేయక తప్పదన్నారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు ఇచ్చారని.. కేటీఆర్‌ రూ.50 కోట్లు ఇచ్చినా తీసుకుంటామన్నారు.

Also Read :  మవోయిస్టులకు మరో దెబ్బ.. శబరినదిలో భారీ ఎన్‌కౌంటర్!

 డబ్బు వ్యామోహం కన్నా రాజకీయ వ్యామోహంతో చేసే పనులు చాలా డేంజరన్నారు. అదానీ న్యాయంగా ఒప్పందాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదని తెలిపారు. మా ప్రభుత్వం అదానీతో చేసిన ఒప్పందాలపై జేపీసీ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్తామన్నారు.  మరోవైపు పార్టీలో చేరికలపై కూడా మహేష్‌ కుమార్ గౌడ్ స్పందించారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేటీఆర్‌తో దగ్గరగా ఉండేవాళ్లు మాతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఎంతమంది టచ్‌లో ఉన్నారో త్వరలోనే తెలుస్తుందన్నారు. 

Also Read :  నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!

మరోవైపు అదానీ వ్యవహారంపై తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా స్పందించారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఈ వ్యవహారం వెలుగుచూసిందన్నారు. తెలంగాణలో కూడా అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. '' బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ గ్రూప్ తెలంగాణకు రాలేదు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తెలియకుండానే రేవంత్‌ అదానికి రెడ్‌ కార్పెడ్‌ పరిచారా ?. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. 

Also Read: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా

విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగించేందుకు రేవంత్ ప్రయత్నించారు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం అందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను ఇప్పుడు కెన్యా కూడా రద్దు చేసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని'' కేటీఆర్‌ డిమాండ్ చేశారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు