/rtv/media/media_files/2025/10/19/ap-blast-2025-10-19-16-14-24.jpg)
AP Blast: ఏపీలోని(Andhra Pradesh) పార్వతీపురంమన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుండగా ప్రమాదం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్‌పైభాగం, అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!
క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంంది. విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటెం పేరుతో పార్సిల్ కౌంటర్‌కి బాక్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ అధికారులు, స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం సంగుపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల షాప్‌లో ఈ ప్రమాదం జరగడంతో రూ.కోటి విలువైన టపాసులు దగ్ధమవ్వడం కలకలం రేపింది. ఇర వివరాల్లోకి వెళ్తే.. దీపావళి సందర్భంగా ఆ గ్రామ శివారులో కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ అనే బాణాసంచా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే టపాసుల ప్యాకింగ్ చేసే పేపర్ల వ్యర్థాల్లో అనుకోకుండా నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇది కూడా చదవండి: సోన్ పాపిడి మిఠాయి పుట్టింది మన దేశంలోనేనా..?
గోదాం ఆవరణలో ఉన్న హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాల వరకు మంటలు విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. చివరికి సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో రూ.కోటి విలువైన టపాసులు పేలిపోయాయని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
Follow Us