Rain Alert: వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. నేడూ, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

అల్పపీడనం కారణంగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

New Update
rain alert

Rain Alert:  అల్పపీడనం కారణంగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఈరోజు విజయనగరం, శ్రీకాకుళంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు( మంగళవారం) అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం తో సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

మొన్నటి వరకు భారీ వర్షాలు... 

ఇదిలా మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృస్టించాయి. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసాయి. అలాగే తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడగా, కొన్నిచోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. వారం రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో వాగు, వంకలు, కాలువలు పొంగిపొర్లాయి. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి అక్కడ నివసించే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

మరో వైపు భారీ వరద నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చిన్నపాటి వాగుల్లా దర్శనమిచ్చాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలన్నీ ఎక్కడిక్కడే నిలిచిపోయి 2,3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల ఆఫీసులకు వెళ్ళేవారు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలు  కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్ల మీద  డ్రైనేజీలు, వరద నీరు పొంగిపొర్లడంతో మోకాళ్ళ లోతుకు  నీరు చేరుకున్నాయి. హైడ్రా, డిజస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, జీహెచ్ ఎంసీ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి హైదరాబాద్  ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ సూచించారు పోలీసులు.  అలాగే పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్కూల్స్ కి సెలవులు ప్రకటించింది. 

ఇక తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల పంటలు నీటమునిగి రైతులకు భారీ నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. 

Advertisment
తాజా కథనాలు