/rtv/media/media_files/2025/07/11/anakapalle-toll-plaza-2025-07-11-16-42-32.jpg)
Anakapalle toll plaza
AP Crime: ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి ఒకటవ కౌంటర్ నుంచి రెండవ కౌంటర్‌కు దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగలు తీశారు. రెండవ కౌంటర్ లోకి వెళ్లిన లారీ ఆ కౌంటర్‌లో ఆగి ఉన్న మరో వ్యాన్‌ను ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం మూలంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.