విజయవాడ జిల్లా జైలును హోం మినిస్టర్ వంగలపూడి అనిత సోమవారం తనిఖీ చేశారు. జిల్లా జైలులో గంజాయి సరఫరా అవుతుందన్న ఆరోపణలను హోం మంత్రి పరిశీలించారు. పోలీసులు పార్టీలకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని మంత్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని.. ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులను బెదిరింపులకు గురిచేసి గత ప్రభుత్వం పాలనా వ్యవస్థను భ్రస్టుపట్టించిందని అన్నారు.
READ ALSO : పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా
విజయవాడ జైలులో మౌలిక వసతులపై ఆమె ఆరా తీశారు. ఇటీవల వచ్చిన ఆరోపణల గురించి మంత్రి అధికారుల నుంచి వివరణ కోరింది. జైలు అధికారులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. రెండు రోజుల్లో నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ నేతల తప్పులు బయటపడుతున్నాయని విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు.
READ ALSO : బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య
కాకినాడ పోర్ట్‌లో అవినీతి గురించి విచారణ జరుగుతుందని రేషన్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. వైసిపి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్&కో రాష్ర్ట సంపదను దోచుకున్నారని ఆమె ఆరోపించింది. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైసిపి నేతలు మాట్లాడుతున్నారని అన్నది.
ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా