ప్రపంచంలో పెద్దపెద్ద సంస్థలకు సీఈఓలు, డైరెక్టర్లుగా తెలుగు మూలాలు ఉన్నవారే ఉన్నారు. తాజాగా ఆంధ్రాకు చెందిన తెలుగు మహిళకు అత్యున్నత పదవి వరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒక్కటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) డైరెక్టర్‌గా కొల్లి భారతి(43) భాద్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి వాడాడకు చెందింది. Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే ! భారతి తండ్రి కొల్లి సింహాచలం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కూతురే భారతి. ఈమె చెల్లి రూప కూడా జర్మన్ బ్యాంక్ ప్రెడిడెంట్ గా పని చేస్తోంది. భారతి మదనపల్లెలోని ఎంసీబీటీ కళాశాలో బీ టెక్ పూర్తి చేసింది. 1999లో బెంగళూర్ లోని హెచ్ పీ, డెల్ కంపెనీల్లో జాబ్ చేసింది. 2012లో డెల్ సంస్థ తరుపున భారతి యూఎస్ వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తూనే అమెరికా డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది భారతి. ఐసీబీసీకి సెలెక్ట్ అయ్యి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తోంది. Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు! Also Read: విషాదం.. నవ వధువు ప్రాణం తీసిన హీటర్