కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
డబ్బులు ఇవ్వలేదని జూనియర్ విద్యార్ధిని చిత్రహింసలు పెట్టారు సీనియర్లు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో నీట్ కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది. బాధిత విద్యార్ధి మర్మాంగాలనికి తాడుకట్టి వేలాడదీయడమే కాకుండా..జుట్టు కాల్చి, కొట్టి అమానుషంగా ప్రవర్తించారు.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లేడీస్ హాస్టల్లో జూనియర్లపై వేధింపులకు పాల్పడిన పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25, జువాలజీకి చెందిన మొత్తం 81మంది సీనియర్లను వారం రోజులు పాటు సస్పెండ్ చేశారు అధికారులు.
ఏలూరు ప్రభుత్వ జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ర్యాగింగ్ కు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందిని తోటి విద్యార్థులు చెబుతున్నారు.