CM Jagan: ఏపీకి దూరంగా సీఎం జగన్
AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నాంపల్లి కోర్టు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యారు. దాదాపు 15 రోజుల పాటు ఏపీకి దూరంగా జగన్ ఉండనున్నారు. తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు.
AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నాంపల్లి కోర్టు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యారు. దాదాపు 15 రోజుల పాటు ఏపీకి దూరంగా జగన్ ఉండనున్నారు. తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు.
ఎన్నికల తరువాత ఏపీలో పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపించామంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు పోలీసు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురును అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.
మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రెండో రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
AP: కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి పయనమయ్యారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో పోలింగ్ తరవాత జరిగిన ఘటనల పైన నివేదిక ఇవ్వనున్నారు.
పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.