AP Politics : మద్యం తాగే వారు మాకు ఓటు వేయలేదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడం కూడా తమను దెబ్బకొట్టిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రభావం కూడా నష్టం చేసిందన్నారు.