AP : తిరుమల బయలు దేరిన అమరావతి రైతులు.!
తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు.
తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు.
AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మోదీతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదన్నారు.
AP: రాజధాని పరిధిలో పిచ్చిమొక్కల తొలగింపునకు సీఆర్డీఏ కార్యాచరణ చేపట్టింది. నెల రోజుల్లోగా పిచ్చిచెట్లు, ముళ్లచెట్లు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల వద్ద శుభ్రం చేయాలని సీఆర్డీఏ ఆదేశాలు జారీ చేసింది.
AP: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామని చంద్రబాబు అన్నారు.
మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి ఇవాళ తాడేపల్లికి రానున్నారు. ఇదిలా ఉంటే, జగన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు వైట్ షర్ట్ లో కనిపించే జగన్ తాజాగా వైట్ కుర్తాలో కనిపిస్తున్నారు. బెంగళూరులో అభిమానులతో దిగిన జగన్ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్ ఎస్పీ మల్లికాగార్గ్కి ఫిర్యాదు చేశారు. వెంచర్ అనుమతుల కోసం వివిధ దశల్లో తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం కావాలని అధికారులను వేడుకుంటున్నారు.
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరగనుంది. పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీని ద్వారా 65.18 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంపిణీ కోసం రూ.4, 408 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.