AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు: మంత్రి నాదెండ్ల

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదన్నారు.

New Update
AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు:  మంత్రి నాదెండ్ల

Guntur: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదన్నారు. కొన్ని సీరియస్ కేసులు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటాన్ని తగ్గించాలని.. అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలపై దృష్టి సారించాలని ఏం కావాలో తన దృష్టికి తీసుకురావాలని కామెంట్స్ చేశారు.

Also Read: పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..!

ఆసుపత్రిలో పేద ప్రజలకు ధైర్యం నింపే విధంగా వైద్య సేవలు మెరుగు పరిచేవిధంగా ముందు వెళ్తామన్నారు. గుంటూరు జిల్లాలో రెండో పెద్ద ఆసుపత్రి తెనాలిలో ఉందని కానీ సరైన సాకర్యలు లేకపోవటం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో క్రిటికల్ కేర్ కి మరో 100 పడకలు నిర్మాణం జరుగుతుందన్నారు. వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రిలో పరికరాలు కొరత, నిధుల కొరత ఉందని..దాన్ని అధిగమించటానికి దాతల సహకారం, కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సహకారంతో అధిగమించే విధంగా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.

రోజు వెయ్యిమంది రోగులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి చికిత్స కోసం వస్తారని ఆ సంఖ్య ఇంకా పెరగాలని ఫ్రెండ్లీ ఆసుపత్రిగా ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. హాస్పటల్లో పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడ తల్లి పిల్లల పోషణలో ఆహార లోపం కనపడుతుందని అంతేకాకుండా డయేరియా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని దానికి అందరి సహాయ సహకారం అందించాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు