CM Chandrababu: నేడు బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు పర్యటన
AP: ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈరోజు ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ.
కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
AP: ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని చెప్పింది. ఈ విధానాన్ని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలిగించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు.
రాష్ట్రంలో తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుండే వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీయాలని రౌడీ డాన్లకు కమాండర్ సజ్జల కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తున్నారన్నారు.
టీడీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వినుకొండలో మూడు హత్యలు జరిగాయని.. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.