AP Fiber Net : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెండ్ చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 19 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Fiber Net: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర సర్వీసెస్ నిబంధనలు ఉల్లఘించినట్లు పేర్కొంది. ఈ 2008 బ్యాచ్ కు చెందిన IRAS అధికారి మధుసూదన్ రెడ్డిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ గా ఉన్న ఆయన.. ఈ విధంగా ప్రతీ నెలా రూ. 14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ. 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా దీనిపై విచారణను ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. Also Read : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్ #ap-fiber-net-corporation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి