Lokesh: దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై!

AP: మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పారు. ప్రజాదర్బార్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్‌కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

New Update
Lokesh: దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై!

Minister Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలు తెలుసుకొని, వాటిని తీర్చేందుకు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన  ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని.. పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కాగా అధికారాలు నిర్లక్ష్యంతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ప్రజాదర్బార్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్‌కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఏంటి సార్ ఇది అంటూ..

ప్రజాదర్భార్ కు సంబంధించి తాను ఎదుర్కొంటున్న సమస్యను ఓ నెటిజెన్ ట్విట్టర్(X) వేదికగా మంత్రి లోకేష్ ముందుకు తెచ్చారు. అధికారుల పనితీరుపై ప్రశ్నిస్తూ లోకేష్ కు తమ సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశాడు. రిషిక్ అనే వ్యక్తి ట్విట్టర్ లో.." ప్రజా దర్బార్ లో సమస్య గురించి చెప్పాక పరిష్కారం చేస్తాం అని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆగస్టు 9న రిడ్రెస్సెడ్ అని ఇచ్చారు. కానీ, ఇంకా సమస్యను పరిష్కరించలేదు. సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు మెసెజ్ పంపారు. ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ధ చూపాలని ఆశిస్తున్నాం."అంటూ మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేశాడు. 
తప్పకుండా పరిష్కరిస్తాం..
అతని ట్వీట్ పై మంత్రి లోకేష్ స్పందించారు. అధికారుల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తన బృందం సంబంధిత అధికారులతో మాట్లాడి, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ను తమ టీం అందిస్తుందని ఫిర్యాదుదారుడికి భరోసానిచ్చారు. కలిగిన అసౌకర్యానికి సారీ అని అన్నారు. లోకేష్ స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు  ప్రసంశలు కురిపిస్తున్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : మా నాన్నను కొట్టొద్దు ప్లీజ్.. గుండె పగిలి చనిపోయిన చిన్నారి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు