నేడు గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన
AP: ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. సహన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు. కాగా నాలుగు రోజుల కిందట సహనపై ప్రియుడు నవీన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
AP: ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. సహన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు. కాగా నాలుగు రోజుల కిందట సహనపై ప్రియుడు నవీన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, ఉచిత ఇసుక విధానం సవరణ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
AP: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా నిలిపేసిన 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర పోలీసు సంక్షేమనిధికి ఏటా రూ.20 కోట్ల చొప్పున నిధులివ్వనున్నట్లు ప్రకటించారు.
పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి ముప్పాళ్ల మండలం తొండపిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం కత్తులు,కర్రలతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవుల అనంతరం కాలేజీకి వచ్చిన విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది.
AP: వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఆమె వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేనలో చేరారు.
AP: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి నాణ్యమైన మద్యాన్ని కేవలం రూ.99లకే అందించనుంది. ఇప్పటికే 10వేల కు కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20వేల కేసులు చేరుతుందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ తెలిపారు.
AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు.