/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Ex-CM-Jagan.jpg)
Jagan: ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. సహన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. నాలుగు రోజుల కిందట సహనపై ప్రియుడు నవీన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని వేధింపులు చేయగా.. కారులో బయటకు తీసుకెళ్లి సహన తలను కారు బానెట్ కు నవీన్ బాదేశాడు. ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్ లో చేర్పించాడు. సహన్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యుల నిర్దారించారు. సహన ఎపిసోడ్‌పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నవీన్‌కు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!
ఈ కేసులో బిగ్ ట్విస్ట్....
సహన మృతిపై పరస్పర విమర్శలు చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ పార్టీలకు నిందితుడు నవీన్ తల్లి కుమారి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తన కొడుకు నవీన్ వైసీపీ కి చెందిన మనిషి అని పేర్కొంది. వారి వలనే రౌడీషీటర్ అయ్యాడని చెప్పింది. రాజకీయంగా వైసీపీ నేతలు సహన ఘటనను వాడుకుంటున్నారని ఫైర్ అయింది. తన కుటుంబాన్ని రాజకీయ స్వలాభం కోసం వేదించవద్దని కోరింది.
తెనాలి నియోజకవర్గం ఐతానగర్‌కు చెందిన సహానా మీద జరిగిన దాడిలో వల్లభాపురంనకు చెందిన నిందితుడు అయిన రాగి నవీన్ తల్లి రాగి కుమారి స్వయంగా తానే చెప్పింది తన కొడుకు వైసీపీకి చెందిన మనిషి అని. వైసీపీ వారి వల్లనే రౌడీషీటర్ అయ్యాడని రాజకీయంగా వైసీపీ నేతలు ఈ ఘటననీ వాడుకుంటున్నారు అని… pic.twitter.com/XXgzaff6nZ
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!
జగన్ పర్యటన వివరాలు..
నేడు గుంటూరులో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 10:30 గంటలకు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో మృతి చెందిన , తెనాలి యువతి సహనా కుటుంబ సభ్యులను పరామర్శిస్తార. అనంతరం హెలికాప్టర్‌లో వైఎస్ఆర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.
ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!