నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ

AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

CM Chandrababu: ఈరోజు ఎన్టీఆర్‌ భవన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఎన్టీఆర్‌ భవన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీ  జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్డీయే ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా 8 అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్‌ వ్యవస్థలు, పల్లె పండుగ, సూపర్‌ సిక్స్ పాలసీలపై సీఎం చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఎంపీల నుంచి చంద్రబాబు తెలుసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

ప్రజలకు అందుబాటులో....

ఇటీవల పార్టీ నేతలతో సమావేశం అయిన సీఎం చంద్రబాబు వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతలందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను అండగా ఉండేందుకు ప్రతి వారం ఒక మంత్రి కేంద్ర కార్యాలయంలో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం చూసిన ప్రజలు.. రాష్ట్ర అభివృద్ధి మనతోనే సాధ్యమవుతుందని నమ్మకంతో భారీ మెజారితో ప్రతిపక్షం లేకుండా చేసిన గెలిపించారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం మనమందరం పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మన పనులతో సమాధానం ఇవ్వాలని అన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

హామీల అమలు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుందాం ప్రజలను మభ్య పెడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం ఇవ్వద్దని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా అవసరమైన హామీలను వెంటనే ప్రారంబించాలను.. అందుకు తగ్గ బడ్జెట్ ను రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన మాదిరే ఏపీలో కూడా సూపర్ సిక్స్ హామీలను ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. కాగా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి కీలక హామీలను డిసెంబర్ నెలలో అమలు చేయాలనే ఆలోచనలోం కూటమి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బడ్జెట్ సమావేశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నిన్ను చంపేస్తాం.. సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్!

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు