నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్

AP: పరువునష్టం దావా కేసులో ఈరోజు విశాఖ కోర్టుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు.

New Update
Lokesh: ప్యాలెస్ బ్రోకర్ సజ్జల.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Nara Lokesh: పరువునష్టం దావా కేసులో ఈరోజు విశాఖ కోర్టుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. పరువుకు భంగం కలుగజేసేందుకు అసత్య కథనాలు ప్రచురించారని.. తప్పుడు కథనం రాసిన సాక్షిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ అడ్డం పెట్టుకొని ఆ సాక్షి పేపర్ ను ప్రతి గ్రామాల్లో కొనేలా చేశారని లోకేష్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని లోకేష్ ధ్వజమెత్తారు. 

ఇది కూడా చదవండి: నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఇటీవల వైసీపీపై ఫైర్..

ఇటీవల మాజీ సీఎం జగన్ పై ట్విట్టర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్. అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారని అన్నారు. 

ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

 ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ హయాంలోనే పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని పేదలకు వరంగా అందిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానండి ఎంపీ అంటూ చురకలు అంటించారు. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే పనిలో మా ప్రభుత్వ సహకారం తీసుకోండి.. అప్పుడు ఎన్నుకున్న మీ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు అని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: నిన్ను చంపేస్తాం.. సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు