/rtv/media/media_files/2025/04/28/vzd2lJ6qrr6bSg9jPUcr.jpg)
Gorantla Madhav
Gorantla Madhav : వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం నగరం పాలెం పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలంటూ ఆదేశించింది. కాగా పదివేల పూచికత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరు చేసింది. కాగా చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
ఇటీవల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆయన అడ్డగించారు. అంతేకాక అతని అంతు చూస్తామని బెదిరించారు. కిరణ్‌ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు వరకూ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించారు. ఈ క్రమంలో విధులను అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?
కాగా అరెస్ట్ సమయంలో పోలీసుల విధులకు గోరంట్ల మాధవ్ ఆటంకం కలిగించారని ఎస్పీ తెలిపారు. ఇలా పోలీసుల విధులకు ఆటంకం కలిగించటం నేరపూరితచర్య అని పేర్కొన్నారు. చుట్టుగుంట వద్ద పోలీస్ వాహనాన్ని అనుచరులతో కలిసి మాధవ్ అడ్డుకున్నారని ఇంక మాధవ్‌తో పాటు మరో ఐదుగురు ఈ దాడిలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. అంతే కాకుండా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని అతనితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
Also read : Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి!