ఏపీ టీచర్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌...వచ్చే నెలటెట్, జనవరిలో కొత్త డీఎస్సీ

ఏపీ టీచర్‌ ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ లో టెట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.

New Update
Ap dsc

Good news for AP teacher candidates

Good news : ఏపీ టీచర్‌ ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అంతేకాదు 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు. అలాగే 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మార్చిలో డీఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చూడండి: Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్‌ వీరేందర్‌ గుహ్‌మన్‌ మృతి...శోక సముద్రంలో పంజాబ్

కాగా నోటిఫికేషన్లు రానున్న దృష్ట్యా టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ సూచించారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 2026 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయన సూచించారు. బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ఇటీవల డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ నుంచి బడుల్లో చేరుతారని మంత్రి తెలిపారు. ఈ ఏడాదిలో విడుదలైన డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నామన్నారు.

ఇది కూడా చూడండి: Illegal Betting Case : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు...కోట్లాది డబ్బు..కిలోలకొద్ది బంగారం..

Advertisment
తాజా కథనాలు