Simhachalam: సింహాచలంలో గిరి ప్రదక్షిణ.. ప్రమాదకర స్థితిలో భక్తులు

సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గిరిప్రదర్శణకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో భారీ రద్దీ నెలకొంది. ఉదయం నుంచే తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీగా జనం పోగయ్యారు. తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. 

New Update
Simhachalam Giri Pradakshina

Simhachalam Giri Pradakshina

సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గిరిప్రదర్శణకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో భారీ రద్దీ నెలకొంది. ఉదయం నుంచే తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీగా జనం పోగయ్యారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి:పిల్లలపై వేడి పాలు లేదా టీ పడ్డాయా.. అయితే ఈ ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి

Simhachalam Giri Pradakshina

నిజానికి గిరిప్రదర్శణకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అధికారులు, పోలీసులు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులను మొహరించినప్పటికీ ముందస్తు ప్లానింగ్‌ లేకపోవడంతో  రద్దీ నియంత్రణ విషయంలో పోలీసు సిబ్బంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. భక్తుల నియంత్రణ సాధ్యం కాకపోవడంతో తొలి పావంచా వద్ద భక్తులు ఎదురెదురుగా రావడంతో తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. 

ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

సింహగిరి ఘాట్‌ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో పాటు బస్సులు దిగిన భక్తులు తొలి పావంచా వెనుక ప్రాంతంలో ఉన్న ఇరుకైన సందు నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. తక్షణమే తొలి పావంచా వద్ద పోలీసు రోప్‌ పార్టీలను ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేపగుంట కూడలిలో వాహనాల రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ నియంత్రణను అధికారులు పట్టించుకోపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎటువెళ్లాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేపగుంట నుంచి నాయుడుతోట, చేములపల్లితో పాటు పెందుర్తి రోడ్డులో కృష్ణరాయపురం వరకు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

Also Read :  హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ దందా...25 మంది ప్రముఖులకు షాక్‌

simhadri-appanna-swamy | simhadri-appanna | simhachalam-temple | simhachalam news today | simhachalam temple vizag | news about simhachalam temple

Advertisment
Advertisment
తాజా కథనాలు