Samosa: ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు

ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు.

New Update
samosas

Samosa

Samosa: ఇండియాతో పాటు కొన్ని దేశాల్లో సాయంత్రం స్నాక్స్‌లా సమోసా, టీ కలిపి తీసుకుంటూ ఉంటారు. సమోసా భారతీయ ప్రజలకు అత్యంత ఇష్టమైన స్నాక్స్‌లో ఒకటి. దేశంలోని ప్రతి మూలలో, వీధుల్లో సమోసాలు కనిపిస్తూ ఉంటాయి. చోటును బట్టి రేటు కూడా మారుతూ ఉంటుంది. కానీ ఒక ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. ఒకవైపు ఆసియా దేశాల నుంచి సమోసాలు యూరప్‌కు చేరుతుండగా, మరోవైపు ఆఫ్రికా దేశమైన సోమాలియాలో సమోసాలు తినడంపై నిషేధం ఉంది.

Also Read: రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు

నిషేధించటానికి ఇదే కారణం:

ఈ దేశంలో సమోసాలు తయారు చేయడం, కొనడం, తినడంపై నిషేధం ఉంది. ఉల్లంఘించినందుకు కఠిన శిక్షలు కూడా ఉంటాయి. సోమాలియాలోని ఒక తీవ్రవాద సమూహం సమోసా ఆకారం క్రైస్తవ సమాజానికి చిహ్నంగా ఉందని భావిస్తారు. మరో కారణం ఏంటంటే సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు. 10వ శతాబ్దంలో మధ్య ఆసియాకు చెందిన అరబ్ వ్యాపారితో సమోసా వచ్చిందని చెబుతారు. ఇరానియన్ చరిత్రకారుడు అబోల్ఫాజీ బేహకీ ఈ విషయాన్ని "తారిఖ్-ఇ బేహకీ"లో పేర్కొన్నాడు. సమోసా ఈజిప్టులో పుట్టిందని నమ్ముతారు.

ఇది కూడా చదవండి:  ఉప్పు నీటితో ఇలా చేస్తే.. ఎంత గాఢ నిద్ర వస్తుందో తెలుసా..?

ఇక్కడి నుంచి లిబియా, ఆ తర్వాత మధ్యప్రాచ్యానికి చేరుకుంది. ఇది 16వ శతాబ్దం వరకు ఇరాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. అమీర్ ఖుస్రో ప్రకారం ఇది 13వ శతాబ్దంలో మొఘల్ కోర్టులో ఇష్టమైన వంటకం. అయితే బంగాళాదుంప సమోసాలు 16వ శతాబ్దంలో పోర్చుగీస్ భారతదేశానికి బంగాళాదుంపలను తీసుకువచ్చినప్పుడు ఉద్భవించాయి. అప్పటి నుండి ప్రజలు సమోసాలను ఇష్టపడటం మొదలుపెట్టారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం

 

 

ఇది కూడా చదవండి:  కాఫీలో పంచదార వేసుకోకపోతే.. వచ్చే అద్భుత లాభాలు ఇవే!!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు