ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా..? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా..? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే.. భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
నేడు నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ వైసీపీ మాజీ మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆపై ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారని.. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు అవతరణ దినం ఉంది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలన ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!
ఆరు కోట్ల ఆంధ్రులను అవమానించారు
ఆరు కోట్ల ఆంధ్రులను, ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అవమానించారన్నారు. మన చుట్టూ ఉన్న తెలంగాణకు అవతరణ దినం ఉంది, అలాగే కర్నాటక, తమిళనాడు, ఒడిశాకు అవతరణ దినం ఉందని అన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలన ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినం లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని చంద్రబాబు ప్రభుత్వం కనీసం జరపలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవం నిర్వహణ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు.
Also Read: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !
కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా..? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా..? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే.. భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..? చంద్రబాబు అంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం
తక్షణమే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని.. గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా నిర్వహించాలని అన్నారు. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించినందుకు గానూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.