TTD: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఏఆర్‌ డెయిరీ

తిరుపతి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఐర్‌ డెయిరీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కంపెనీ.. నాణ్యత నిర్ధారణ టెస్టులు చేశాకే నెయ్యి సరఫరా చేశామని, తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొంది.

New Update
AR Dairy

తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిపారని వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ లడ్డూ తయారీలో జంతు కొవ్వు వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఏఐర్‌ డెయిరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ల్యాబ్ పరీక్షల్లో కూడా ఈ విషయం బట్టబయలైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తమిళనాడులోని ఏఆర్‌ డెయిరీలో సోదాలు జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది.  

Also Read: లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్ర.. వారంతా రక్తం కక్కుకుని చస్తారు!

మరోవైపు తమిళనాడులోని పళణి సుబ్రహ్మణ్యం ఆలయంలో పంచామృతం ప్రసాదంలో కూడా ఏఆర్‌ డెయిరీ నెయ్యిని వాడుతున్నారంటూ సోషల్ మీడీయాలో ప్రచారం నడుస్తోంది. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రచారాలను ఖండించింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్‌ నెయ్యి వాడుతున్నట్లు పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మకండని సూచనలు చేసింది.  

అలాగే ఈ వ్యవహారంపై ఏఆర్‌ డెయిరీ కూడా స్పందించింది. నాణ్యత నిర్ధారణ టెస్టులు చేసిన తర్వాతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేశామని పేర్కొంది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, నాణ్యతా లోపం లేదని క్లారిటీ ఇచ్చింది. జున్, జులై నెలల్లోనే తాము నెయ్యి సరఫరా చేశామన్న ఏఆర్‌ డెయిరీ.. ఇప్పుడు టీటీడీకి నెయ్యిని సరఫరా చేయడం లేదని చెప్పింది.  గత 25 ఏళ్లుగా తాము డెయిరీ సేవలు అందిస్తున్నామని ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదని పేర్కొంది. టెస్టులు చేశాకే నాణ్యమైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేశామని వెల్లడించింది. 

Also Read: గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు పొగలు రావడంతో..

Advertisment
తాజా కథనాలు