గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు పొగలు రావడంతో..

గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బెంగళూరు నుంచి గౌహతికి ఈ రైలు  వెళ్తుండగా.. సింహాచలం వచ్చే సరికి ఎస్-7 భోగిలో పొగలు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సింహాచలంలో ట్రైన్‌ను నిలిపివేశారు.

New Update
Gowhathi express

గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గౌహతి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. రైలు విశాఖపట్నంలోని సింహాచలం వచ్చే సమయానికి ఎస్ 7 నంబర్ భోగిలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే సింహాచలంలో రైలుని నిలిపివేశారు. పొగలు అధికం అయ్యి.. మంటలు పెరిగే ప్రమాదం ఉంటుందని అధికారులకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్‌ రాక కోసం వేచి చూస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు