Fake Taskforce Officer : టాస్క్‌ఫోర్స్‌ అధికారినని బిల్డప్‌ ఇచ్చి...చివరికి

టాస్క్‌ఫోర్స్‌ అధికారినంటూ పలువురి బెదిరించి డబ్బులు వసూలు చేస్తు్న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ 2006 నుంచి హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

New Update
Fake task force officer

Fake task force officer

టాస్క్‌ఫోర్స్‌ అధికారినంటూ (Taskforce Officer) పలువురి బెదిరించి డబ్బులు వసూలు చేస్తు్న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ 2006 నుంచి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై జీఆర్ పి ఎఫ్ విజయవాడ లో విధులు నిర్వహిస్తున్నాడు. చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడిన సుమన్‌ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అప్పటినుండి అతను అనేక మంది పోలీస్ అధికారుల వద్ద పనిచేసినట్లు కవరింగ్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.  

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

Fake Taskforce Officer Arrested

హోంగార్డు సుమన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ డబ్బులు ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్లో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ద్వారా  ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని సదరు వైన్ షాప్ కు చెందిన వ్యక్తులకు ఫోన్లు చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

Also Read :   ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌!

ఇటీవల కాలంలో మచిలీపట్నం (Machilipatnam) తాళ్లపాలెం పంచాయతీలో గల వసుధ వైన్స్ కు ఫోన్ చేసి తాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ నుండి మాట్లాడుతున్నట్లు తనకు రూ.వేలు ఫోన్ పే చేయమని లేదంటే వారి షాపు  లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. వసుధ వైన్స్ యాజమాన్యం నుండి వద్ద నుండి రూ.6వేలు ఫోన్ పేలో డబ్బులు తీసుకున్నాడు. మరల రెండవ రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో సదరు హోమ్ గార్డ్ పనిమీద మచిలీపట్నం వచ్చి వసుధ వైన్స్ యాజమానికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు.అయితే అనుమానం వచ్చిన అతను తన అకౌంట్లో డబ్బులు లేవని కాష్ మాత్రమే ఉన్నదని చెప్పి క్యాష్ చేతికి ఇస్తానని  హోంగార్డును బీచ్ రోడ్ లో గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు రమ్మని చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వసుధ వైన్స్ యాజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హోంగార్డు ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

Also Read :  చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు