Roja-Pawan kalyan : పవన్ను అంత మాటన్న రోజా.. అపానవాయువు అంటూ సంచలన ట్వీట్!

పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు.  అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?  అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే రోజా పోస్ట్ చేసిన అపానవాయువు అనే పదంపై  జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

New Update
roja-and-pawan

ఏపీలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్‌ చేశారు. పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడవటూ రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదని విమర్శించారు. అయితే దీనిపై వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కౌంటర్ ఇచ్చారు.  నా పేరు పవనం... నేను తిరుగుతూ ఉంటాను... మనం పవనాలు... అవి బావిలో కప్పలు అంటూ పవన్ సంబోధించారు.

Also Read :  Pakistan : పాకిస్తాన్‌ బలుపు చేష్టలు .. ఆరు డ్రోన్లను కూల్చేసిన భారత్‌

 అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?  

ఇన్ డైరెక్ట్ గా  పవన్ వైసీపీ నాయకులను, ముఖ్యంగా రోజాను ఉద్దేశించి పవన్ ఈ కామెంట్ చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు.  అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?  అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే రోజా పోస్ట్ చేసిన అపానవాయువు అనే పదంపై  జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అపాన వాయువు అంటే.. పిత్తు. అంటే.. పవన్ కళ్యాణ్‌ని అలా పోల్చుతారా అని మండిపడుతున్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని,మరి ఇంత దిగజారి మాట్లాడితే ఎలా  అని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ట్వీట్ చేశాక ఆమె కింద ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉండేందుకు కామెంట్స్ ఆప్షన్ ను డిసేబుల్ చేశారు. 

Also Read :  Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ  వచ్చాడు.. కుంటుకుంటూ క్రీజులోకి - VIDEO

Advertisment
తాజా కథనాలు