/rtv/media/media_files/2025/07/24/pant-2025-07-24-17-39-44.jpg)
Rishabh Pant: మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిన పంత్.. తిరిగి కుంటుకుంటూ క్రీజులోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రెండో రోజు లంచ్ టైమ్ కు భారత్ 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (20), రిషబ్ పంత్ (39) ఉన్నారు.
Here comes Rishabh Pant...
— England Cricket (@englandcricket) July 24, 2025
A classy reception from the Emirates Old Trafford crowd 👏 pic.twitter.com/vBwSuKdFcW
పంత్ బ్యాటింగ్ చేస్తుండగా
మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు పంత్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే, క్రిస్ వోక్స్ వేసిన బంతి అతని కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది. స్కాన్ నివేదికలో అతని కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. పంత్ గాయం కారణంగా 37 పరుగుల వద్ద రిటైర్ అయ్యాడు, అతని స్థానంలో రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయం పెద్దది కావడంతో ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ పంత్ బ్యాటింగ్ కు రావడం విశేషం.